రెండేళ్లు పైబడిన పిల్లలకు కరోనా వ్యాక్సిన్!

రెండేళ్లు పైబడిన పిల్లలకు కరోనా వ్యాక్సిన్!

దేశంలో చిన్న పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాబోతోంది. భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కొవాగ్జిన్‌ టీకా ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. దీంతో రెండేళ్ల నంచి 18 ఏండ్ల మధ్య వయసున్న వారికి కూడా ఈ వ్యాక్సిన్ వేసేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్ కమిటీ సిఫారసు చేసింది. దీనిని అత్యవసర వినియోగానికి అనుమతించవచ్చని సూచించింది.

20 రోజుల గ్యాప్‌తో రెండు డోసులు

భారత్ బయోటెక్‌..  పద్దెనిమిదేళ్ల లోపు వారిపై కొవాగ్జిన్ రెండో దశ, మూడో దశ ట్రయల్స్‌ను పూర్తి చేసి, ఆ ప్రయోగాల ఫలితాలను డీసీజీఐకు ఈ నెల మొదటి వారంలో అందజేసింది. వాటిని సమగ్రంగా పరిశీలించాక సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్ కమిటీ రెండేళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వారికి ఎమర్జెన్సీయూసేజ్‌కు కొన్ని నిబంధనలతో అనుమతి ఇవ్వొచ్చని పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌ కేలవం 20 రోజుల గ్యాప్‌తోనే రెండు డోసులు వేయాల్సి ఉంటుంది. పిల్లలపై ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌ను కంపెనీ ఇంకా కొనసాగించనుంది. తొలి రెండు నెలల పాటు 15 రోజులకోసారి చొప్పున భారత్ బయోటెక్ కంపెనీ తమ వ్యాక్సిన్ సేఫ్టీ డేటాను డీసీజీఐకి సబ్మిట్ చేయాలని నిబంధన విధించారు. ఆ తర్వాత అవసరమైతే నెలకోసారి చొప్పున డేటా ఇవ్వాల్సి ఉంటుంది.

కాగా, ఇప్పటికే భారత్‌లో 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వారికి జైడస్ కాడిలా ఫార్మా కంపెనీ డెవలప్ చేసిన వ్యాక్సిన్‌ను వేసేందుకు ఎమర్జెన్సీ అప్రోవల్‌ను డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ప్రపంచంలోనే తొలి డీఎన్‌ఏ కరోనా వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం.

మరిన్ని వార్తల కోసం..

ఎయిర్‌‌పోర్టులోకి భారీ వరద.. ప్రయాణికులను ట్రాక్టర్‌‌లో తరలింపు

ఢిల్లీలో పాక్ టెర్రరిస్టు అరెస్టు

లంకలో సంక్షోభం: లీటర్ పాలు రూ.1100.. గ్యాస్ రూ.2657