వచ్చే ఎన్నికల్లో 25 స్థానాల్లో పోటీ చేస్తం : చాడ వెంకటరెడ్డి

వచ్చే ఎన్నికల్లో 25 స్థానాల్లో పోటీ చేస్తం : చాడ వెంకటరెడ్డి

భీమదేవరపల్లి, వెలుగు: డబ్బా ఇల్లు పోయే డబుల్ బెడ్ రూమ్ పోయే అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్​జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో భూ పోరాటంలో భాగంగా సీపీఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమావేశంలో చాడ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లను డబ్బా ఇండ్లు అన్న కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేకపోయాడన్నారు. మహా కూటమి నుంచి రాజకీయ నాయకులు గుణపాఠం నేర్చుకోవాలన్నారు.

అధికార పార్టీ కనుసన్నల్లోనే ప్రభుత్వ భూములు, చెరువు శిఖాల్లో రియల్ ఎస్టేట్ దందా నడుస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో 25 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. జీవో నెంబర్ 58 ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి సర్కారు ఇళ్ల స్థలం కేటాయించాలని, ఇంటి నిర్మాణానికి రూ. ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్​చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్, ఏఐవైఎఫ్​ జాతీయ కార్యవర్గ సభ్యులు మారుపాక అనిల్, జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మంచాల రమాదేవి తదితరులు పాల్గొన్నారు.