నల్గొండ  జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

నల్గొండ  జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

దేవరకొండ(చందంపేట), వెలుగు : నల్గొండ జిల్లాలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం చందంపేట మండలం గన్నెర్లపల్లి గ్రామంలో సీపీఐ మండల 15వ మహాసభ నిర్వహించారు. సభకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నరసింహారెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు మీద శ్రద్ధ పెట్టిందని విమర్శించారు. 

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్​చేశారు. మహాసభలో మండల సహాయ కార్యదర్శి మోగిల్ల వెంగళయ్య, మండల కౌన్సిల్ సభ్యుడు మారెడ్డి కృష్ణారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాంతయ్య, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్యనాయక్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.