పంట బీమా రైతన్న ఇష్టమే

పంట బీమా రైతన్న ఇష్టమే

న్యూఢిల్లీపంట బీమా తీసుకోవాలా వద్దా అనే నిర్ణయాన్ని రైతులకే వదిలేస్తున్నట్లు కేంద్ర కేబినెట్ బుధవారం వెల్లడించింది.   ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బుధవారం కేబినెట్​ భేటీ జరిగింది. ఇందులో ఫసల్​బీమా స్కీంలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వివిధ రైతు సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్​ తెలిపింది. ప్రధాన మంత్రి ఫసల్​బీమా యోజన(పీఎంఎఫ్​బీవై) పథకం ప్రకారం.. బ్యాంకు రుణం తీసుకున్న రైతు తప్పనిసరిగా పంటకు బీమా చేయించాల్సిందే. అయితే, రైతుల విజ్ఞప్తి నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ఈ స్కీంలో మార్పులు చేసింది. పంట బీమా చేయడం ఇకపై తప్పనిసరి కాదని చెప్పింది. ఇప్పుడున్న రైతుల్లో 58 శాతం రైతులు రుణాలు తీసుకుని సాగు చేస్తున్నవారే. ఈ క్రమంలో పీఎంఎఫ్​బీవై స్కీంపై వివిధ రైతు సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ చెప్పారు. దీంతోనే పీఎంఎఫ్ బీవై  స్కీంను కంపల్సరీ నుంచి ఆప్షనల్​గా మార్చేసినట్లు వివరించారు. పీఎంఎఫ్ బీవై స్కీం అద్భుత పథకమని మంత్రి కొనియాడారు. ఈ స్కీం కింద ఇప్పటివరకు రూ.13 వేల కోట్లు ప్రీమియంగా స్వీకరించామని, రూ.60 వేల కోట్ల ఇన్సూరెన్స్ క్లెయింలు పరిష్కరించామని మంత్రి తోమర్ చెప్పారు.

గ్రామాల్లో రెండో దశ స్వచ్ఛ భారత్..

గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్​ మిషన్​ రెండో దశ ప్రారంభించేందుకు కేబినెట్​ ఆమోదం తెలిపింది. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణతో పాటు బహిరంగ మల, మూత్ర విసర్జనను రూపుమాపేందుకు ఈ స్కీం ఉపయోగపడుతుంది. ఈ స్కీం తొలిదశ ఇప్పటికే అయిపోయింది. అంతకుముందు దేశవ్యాప్తంగా 38.7 శాతంగా ఉన్న శానిటేషన్​ కవరేజ్.. ఈ పథకం తర్వాత గరిష్ఠంగా పెరిగిందని మంత్రులు తెలిపారు. కేంద్రం ఈ పథకం అమలులోకి తెచ్చాక.. సుమారు 10 కోట్ల మంది వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకున్నారని చెప్పారు. తాజాగా, దీన్ని మలిదశ కూ విస్తరించాలని కేబినెట్​నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 2020–21, 2024‌‌‌‌–25 పీరియడ్​లలో నిర్వహించనున్న ఈ  పథకానికి  కేంద్ర రాష్ట్రాల బడ్జెట్​ సుమారు రూ52,497 కోట్లని అంచనా వేసినట్లు జలశక్తి మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా, శానిటేషన్​ పనుల కోసం 15వ ఫైనాన్స్ కమిషన్​ రూ.30,375 కోట్ల కేటాయింపులు జరిపింది. గ్రామాల్లో ఇంటింటికీ టాయిలెట్ ఉందని మరోసారి నిర్ధారించుకోవాలంటూ శానిటేషన్​ డిపార్ట్​మెంట్​ రాష్ట్రాలకు సూచించింది.

22వ లా కమిషన్​ఏర్పాటుకు ఓకే

కాంప్లెక్స్ లీగల్ ఇష్యూల్లో ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు 22వ లా కమిషన్​ను ఏర్పాటుచేయాలని కేబినెట్​నిర్ణయించింది. గతేడాది ఆగస్టు 31తో ఇంతకుముందున్న కమిషన్​ టెర్మ్​ పూర్తయింది. ఈ నేపథ్యంలో కొత్త కమిషన్​ ఏర్పాటు ప్రపోజల్​కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో మూడేళ్ల టైంపీరియడ్​తో కొత్త ప్యానెల్​ ఏర్పాటుకు న్యాయ మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు మొదలు పెట్టనుంది. ఈ ప్యానెల్​లో ఒక ఫుల్​టైం చైర్​పర్సన్, నలుగురు ఫుల్​టైం సభ్యులు, న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి ఇద్దరు సెక్రెటరీలు ఎక్స్ అఫీషియో మెంబర్లుగా వ్యవహరిస్తారు. వీరితో పాటు ఐదుగురికి మించకుండా టెంపరరీ సభ్యులను కూడా నియమించుకోవచ్చు అని అధికారికంగా స్టేట్​మెంట్​ విడుదల చేసింది.

అసిస్టెడ్​ రిప్రొడక్టివ్​ టెక్నాలజీ(రెగ్యులేషన్) బిల్

అసిస్టెడ్​రిప్రొడక్టివ్​టెక్నాలజీ(సరోగసి, ఐవీఎఫ్.. తదితర పద్ధతుల)కు సంబంధించి జాతీయ రిజిస్ట్రీ ఏర్పాటు చేయాలని, ఈ రంగంలో సేవలందిస్తున్న ఆస్పత్రులు, డాక్టర్లు, ఇతర సిబ్బంది కోసం రిజిస్ట్రేషన్​ అథారిటీ ఉండాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఓకే చెప్పింది. ఈ ప్రతిపాదనలతో తీసుకొచ్చిన సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఈ బిల్లులో మానవ పిండాల అమ్మకం, సెక్స్​సెలక్షన్​ ప్రాక్టీస్ కు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు ప్రతిపాదనలను పొందుపరిచారు. ఈమేరకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ బిల్లుకు సంబంధించిన వివరాలను కేబినెట్​కు తెలిపారు.

see also: భారతీయుడు2 షూటింగ్​లో ప్రమాదం

రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డు ఆగింది!

సర్కార్ ఫోకస్ : రిటైర్మెంట్​ ఏజ్​ 61