కోటి 60 లక్షల మంది ఐటీ ఉద్యోగులు.. ఒకే రోజు సెలవు పెట్టారు

కోటి 60 లక్షల మంది ఐటీ ఉద్యోగులు.. ఒకే రోజు సెలవు పెట్టారు

అమెరికా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన గేమ్ నైట్ లలో ఒకటి సూపర్ బౌల్ 2024.లాస్ వెగాస్ లోని నెవాడాలో ని అల్లెజియంట్ స్టేడియంలో ఆదివారం (ఫిబ్రవరి 11) జరిగింది. కాన్సా్స్ సిటీ చీఫ్స్ , శాన్ ఫ్రాన్సిస్కో 49 ఎర్స్ మద్య జరిగిన ఈ గేమ్ లో గత విజేత ఓవర్ టైమ్ లో 25-22 తో లొంబార్డీ ట్రోఫిని గెలుచుకుంది. ఈ బిగ్ మ్యాచ్ తర్వాత సోమవారం (ఫిబ్రవరి 12) అమెరికా అంతటా వ్యాపార సంస్థలు మూసివేయబ్డడాయి. సూపర్ బౌల్ సండే తర్వాత అమెరికా లోని దాదాపు 1కోటి 60 లక్షల మంది ఉద్యోగులు తమ ఆఫీసులకు సెలవు పెట్టారట. 

మానవ వనరులు, పేరోల్, వర్క్ ఫోర్స్ మేనేజ్ మెంట్ సోల్యూషన్స్ ప్రొవైడర్ అయిన UKG  జరిపిన సర్వేలో సూపర్ బౌల్ సండే తర్వాత రోజు అయిన సోమవారం 16.1 మిలియన్ల మంది ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లలేదట. గేమ్ నైట్ ముగిసే సమయానికి , ఉత్సవాల కారణంగా లక్షలాది మంది అమెరికన్లు అలసిపోయి సోమవారం కార్యాలయాలకు ముఖం చూపించలేదట. విశేషమేమిటంటే సూపర్ బౌల్ సండే తర్వాత సోమవారం అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని ప్రజలు కోరుకుంటున్నారట..చట్ట సభల సభ్యులు కూడా ప్రయత్నిస్తున్నారట.మరోవైపు ఈ గేమ్ ని ఆదివారం కాకుండా అంతకుముందు రోజైన శనివారం నిర్వహించాలని ప్రతిపాదనలు చేస్తున్నారట.