50 శాతం పతనమైన క్రిప్టో కరెన్సీ!

50 శాతం పతనమైన క్రిప్టో కరెన్సీ!

న్యూఢిల్లీ: బిట్‌కాయిన్‌, ఎథరమ్‌ వంటి టాప్ క్రిప్టో కరెన్సీలు తమ ఆల్‌టైమ్ హైల నుంచి 50 శాతం మేర పతనమయ్యాయి. గత ఏడు సెషన్లలోనే బిట్‌కాయిన్‌ 20 శాతం మేర తగ్గింది.  గ్లోబల్‌గా ఇన్‌ఫ్లేషన్ భయాలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లతో పాటు, క్రిప్టో కరెన్సీ వంటి రిస్క్ ఎక్కువగా ఉన్న అసెట్లలో ఇన్వెస్ట్ చేయడం తగ్గుతోంది. దీంతో ఈక్విటీ మార్కెట్ల మాదిరిగానే క్రిప్టో మార్కెట్ కూడా ఈ వారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. పాపులర్ క్రిప్టో బిట్‌కాయిన్‌ ఆదివారం 35,876 డాలర్ల (రూ. 26.54 లక్షలు)  దగ్గర ట్రేడవుతోంది. కిందటేడాది నవంబర్‌‌లో ఈ క్రిప్టో  కరెన్సీ 69 వేల డాలర్ల వద్ద ఆల్‌టైమ్‌ హైని టచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ లెవెల్‌తో పోలిస్తే ప్రస్తుతం బిట్‌కాయిన్ రేటు సుమారు సగం తగ్గింది. గత ఏడు సెషన్లలో  ఎథరమ్‌ 30 %  నష్టపోయి 2,505 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. సోలానా, అవాక్స్‌  38 % మేర నష్టపోయాయి.  డోజ్‌ కాయిన్‌ 30 %, షిబా ఇను 38 % మేర పడ్డాయి. వచ్చే నెలలోపు డిజిటల్ అసెట్లకు సంబంధించి యూఎస్ గవర్నమెంట్‌ ఓ పాలసీని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశం క్రిప్టోల కదలికలపై ప్రభావం చూపనుంది.