ఇండియా హై గ్రోత్​ రేటు.. ప్రపంచానికే పాజిటివ్

ఇండియా హై గ్రోత్​ రేటు.. ప్రపంచానికే పాజిటివ్

న్యూఢిల్లీ: ఇండియా హై గ్రోత్​ రేటు (అధిక వృద్ధి) ప్రపంచానికి చాలా మంచిదని ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్​ మేనేజింగ్​ డైరెక్టర్​ క్రిస్టలినా జార్జివా చెప్పారు. 2022లో ఇండియా ఎకానమీ 8.2 శాతం గ్రోత్​ సాధించి, ప్రపంచంలోనే వేగంగా ఎదిగే ఎకానమీ అవుతుందని  ఇంతకు ముందే ఐఎంఎఫ్​ అంచనా వేసింది. ఈ గ్రోత్​ రేటు చైనా గ్రోత్​ రేటు 4.4 శాతం కంటే దాదాపు రెట్టింపు. 2022లో గ్లోబల్​ గ్రోత్​ రేటు అంతకు ముందు ఏడాదిలోని 6.1 శాతం నుంచి 3.6 శాతానికి తగ్గిపోనుందని కూడా ఐఎంఎఫ్​ తన అంచనా రిలీజ్​ చేసింది. 2022లో ఇండియా గ్రోత్​ రేటు అంచనా కొద్దిగా తగ్గినప్పటికీ, వేగంగా  ఎదుగుతున్న దేశం అదేనని, 8.2 శాతం చాలా మెరుగైన గ్రోత్​ రేట్​ అని క్రిస్టినా జార్జివా పేర్కొన్నారు. ప్రపంచంలోని చాలా దేశాలలో స్లోడౌన్​ సమస్యలను తెస్తోందని, ఇలాంటి టైములో ఇండియా ఎక్కువ గ్రోత్​ రేటు సాధించడం సంతోషకరమైనదని అన్నారు. గ్లోబల్​గా ఇండియా ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సోలార్​ అలయన్స్​లో చేరడం ద్వారా ఇండియా రెన్యువబుల్​ ఎనర్జీ రంగంలో ముందడుగు వేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జీ20 దేశాలకు వచ్చే ఏడాది ఇండియా నాయకత్వం వహించనుందని చెప్పారు.