ముంబైతో జరుగుతోన్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఈ సీజన్ లో ఇరు జట్లు తలపడడం రెండోసారి. ఫస్ట్ మ్యాచ్ లో ముంబైపై చెన్నై గెలిచింది. మరి ఈ పోరులో చెన్నైపై గెలిచి ముంబై ప్రతికారం తీర్చుకుంటుందా? లేదా చూడాలి. అయితే జ్వరం కారణంగా ముంబై బ్యాట్స్ మెన్ తిలక్ వర్మ ఈ మ్యాచ్ కు దూరంగా ఉంటున్నాడు.
ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ 10 మ్యాచ్ లు ఆడి ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో మూడోస్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ 9 మ్యాచ్ లు ఆడి ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, MS ధోనీ(w/c), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), ఇషాన్ కిషన్(w), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, అర్షద్ ఖాన్