వెదర్ రిపోర్టింగ్‌లో మరో లెవల్: నదిలో దూకి మరీ చెప్తున్నాడు

వెదర్ రిపోర్టింగ్‌లో మరో లెవల్: నదిలో దూకి మరీ చెప్తున్నాడు

వెదర్ రిపోర్టింగ్‌లో వేరే లెవల్ ఏదైనా ఉందీ అంటే ఇదే. ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ ఇలాంటి వెదర్ రిపోర్టింగ్ చేసుండరు.. ఇక ముందు కూడా చేసే సాహసం చేయరు. వెదర్ రిపోర్టింగ్‌లో మాస్టర్ క్లాస్‌గా అభివర్ణిస్తున్న ఈ రిపోర్టింగ్ వీడియో.. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుంది. ఆ వివరాలు..

పాకిస్తాన్‌కు చెందిన అబ్దుల్ రెహ్మాన్ ఖాన్‌ అనే రిపోర్టర్ సైక్లోన్ బిపర్జోయ్ విపత్తు గురించి రిపోర్టింగ్ చేస్తున్నాడు. ఈ సైక్లోన్ ధాటికి సముద్రం ముందుకు చొచ్చుకొచ్చిందని అని చెప్పడానికి అతడు నీటిలోకి దూకి చూపించాడు. అలానే నీటిపై తేలియాడుతూ.. "పానీ ఇత్నా గెహ్రా హై కి కోయి తోడ్ నహీ" అని చెప్పుకొచ్చాడు. చివరగా కెమెరామెన్ తైమూర్ ఖాన్‌తో అబ్దుల్ రెహ్మాన్ ఖాన్‌ అబ్దుల్ రెహ్మాన్ న్యూస్ అని తెలిపాడు.

Masterclass in weather reporting. pic.twitter.com/bedXuvcEaA

— Naila Inayat (@nailainayat) June 14, 2023

అతని రిపోర్టింగ్ స్కిల్స్‌పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అతని నిబద్ధతను మెచ్చుకునే వారు కొందరైతే.. ఇలాంటి వారి వల్లే క్రియేటివిటీ ఇంకా బతికుందని ఇండైరెక్ట్ కామెంట్లతో హోరెత్తిస్తున్నవారు మరికొందరు. అయితే సదరు వ్యక్తి ఇది వినోదానికి చేశాడా? లేదా నిజంగా రిపోర్టరా? అన్నది తెలియడం లేదు. 

ALSO READ: యూట్యూబర్లకు గుడ్ న్యూస్: 500 మంది సబ్ స్క్రైబర్స్ ఉంటే చాలు.. డబ్బులొస్తాయి