నల్లొండ జిల్లాలో గాలివాన బీభత్సం

నల్లొండ జిల్లాలో గాలివాన బీభత్సం
  •     పలుచోట్ల కూలిన చెట్లు, విరిగిన స్తంభాలు

నల్లొండ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదివారం గాలివానకు పట్టణంలో పలుచోట్ల చెట్లు కూలిపోగా, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మున్సిపాలిటీ పరిధిలోని శేషమ్మ గూడెంలో ఇండ్ల పైనుంచి రేకుల లేచిపోగా, ప్రహరీ గోడ కూలింది. విద్యుత్​స్తంభాలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నల్గొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన కొందరు చేపల వేటకు పానగల్లు చెరువుకు వెళ్లగా గాలి దుమారానికి కొడదల సైదులు గల్లంతయ్యాడు.  
-  నల్లగొండ జిల్లా, వెలుగు నెట్​వర్క్​