ట్రాఫిక్ ఆంక్షలు: డైలీ ఉదయం 11:30 గంటల వరకు చాదర్ఘాట్ బ్రిడ్జి బంద్

 ట్రాఫిక్ ఆంక్షలు: డైలీ ఉదయం 11:30 గంటల వరకు  చాదర్ఘాట్ బ్రిడ్జి బంద్
  •     ఎంజీబీఎస్ వైపు ట్రాఫిక్ మళ్లింపు

బషీర్​బాగ్, వెలుగు: సిటీలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక మార్గాలను చూయిస్తున్నారు. ఇందులో భాగంగా పోలీస్​ స్టేషన్​ ముందు నుంచి వెళ్లే  చాదర్​ఘాట్ బ్రిడ్జిని ఉదయం 11:30 గంటల వరకు మూసివేయాలని నిర్ణయించారు. 

దిల్​సుఖ్​నగర్, సైదాబాద్, మలక్​పేట నుంచి వచ్చే వాహనదారులు సాధారణంగా చాదర్​ఘాట్ సర్కిల్ నుంచి రైట్ తీసుకొని, చాదర్​ఘాట్ బ్రిడ్జి మీదుగా రంగమహల్, జాంబాగ్, ఎంజే మార్కెట్ వైపు వెళ్తారు. అయితే, ఈ మార్గంలో తీవ్ర రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని సౌత్ జోన్ ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా చాదర్​ఘాట్ సర్కిల్ నుంచి స్ట్రెయిట్​గా వెళ్లి ఎంజీబీఎస్ సర్కిల్​వద్ద రైట్ తీసుకొని, శివాజీ బ్రిడ్జి మీదుగా ఉస్మానియా, ఎంజే మార్కెట్ వైపు వెళ్లాలని సూచించారు. ఈ మార్గంలో వెళ్లడం ద్వారా త్వరగా గమ్య స్థానాలకు చేరుకోవచ్చన్నారు. ఉదయం 11:30 గంటల తరువాత యథావిధిగా చాదర్ ఘాట్ మీదుగా వాహన రాకపోకలు అనుమతి ఉంటుందన్నారు. ప్రజలు సహకరించాలని డీసీపీ కోరారు.