డేటా లీక్‌ … కనిపెట్టొచ్చు!

డేటా లీక్‌ … కనిపెట్టొచ్చు!

ఈ  రోజుల్లో చాలామంది సోషల్‌‌ మీడియా అకౌంట్లు హ్యాక్‌‌ అవుతున్నాయి. వ్యక్తిగత సమాచారం ఆన్‌‌లైన్‌‌ నేరగాళ్లకు తెలిసిపోతోంది. సీక్రెట్‌‌గా ఉండాల్సిన డేటా హ్యాకర్ల చేతికి వెళ్లిపోతోంది.
ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే డేటా లీకేజీని గుర్తించే అవకాశాలున్నాయి అంటున్నారు టెక్‌‌ నిపుణులు. ఏ యాప్‌‌ వాడినా, యూజర్ల డేటాను ప్రొటెక్ట్‌‌ చేయాల్సిన బాధ్యత ఆ యాప్​ డెవలపర్లు, నిర్వహణా సంస్థలదే.

సాధారణంగా ప్రతి యాప్‌‌ వాడే ముందు కొంత డేటా కలెక్ట్‌‌ చేస్తుంది. కొన్నింటికి పర్మిషన్‌‌ ఇస్తేనే, అవి రన్‌‌ అవుతాయి. నేవిగేషన్‌‌ యాప్‌‌ వాడాలంటే యూజర్లు తమ లొకేషన్‌‌ తెలుసుకునేందుకు పర్మిషన్‌‌ ఇవ్వాల్సిందే. యూజర్లు అంగీకరించిన డేటాను యాప్స్‌‌ కలెక్ట్‌‌ చేయడంలో తప్పులేదు. కానీ, కొన్ని యాప్స్‌‌ మాత్రం యూజర్లకు సంబంధించిన ఇతర వివరాల్ని కూడా ఎలాంటి అంగీకారం లేకుండా తెలుసుకుంటున్నాయి. ఆ డేటా సైబర్‌‌‌‌ నేరగాళ్ల చేతికి వెళ్లి యూజర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయితే ఏ యాప్స్‌‌ మీ డేటాను కలెక్ట్‌‌ చేస్తున్నాయో తెలుసుకోవాలంటే కొన్ని సర్వీసెస్‌‌పై ఆధారపడాలి.

యాప్స్‌‌ సాయంతో

యాంటీ వైరస్‌‌ ప్రొవైడర్‌‌‌‌ ‘క్యాస్పర్‌‌‌‌స్కై’ ప్రకారం ‘యాప్‌‌సెన్సస్‌‌ సర్వీస్‌‌’ సాయం తీసుకుని, ఏ యాప్‌‌ మీ డేటానుసేకరిస్తుంది? ఎవరికి సెండ్‌‌ చేసింది? వంటి వివరాలు తెలుసుకోవచ్చు. ‘యాప్‌‌సెన్సస్‌‌ సర్వీస్‌‌’ యాప్‌‌ ఇన్‌‌స్టాల్‌‌ చేసుకుని, అన్ని అవసరమైన పర్మిషన్స్‌‌ ఇవ్వాలి. ఈ యాప్‌‌ను కచ్చితంగా కొన్ని రోజులపాటు యూజ్‌‌ చేయాలి. ఆ లోపు ఇది మీ డేటాను ఏ యాప్‌‌ కలెక్ట్‌‌ చేసింది వంటి వివరాల్ని అందిస్తుంది.
‘ఎక్సోడస్‌‌ ప్రైవసీ’ అనే మరో సర్వీస్‌‌ ద్వారా కూడా ఈ వివరాల్ని తెలుసుకోవచ్చు.