
కొత్త ఏడాదికి ముందే ఆడియెన్స్‌కి ‘దావత్’ ఇవ్వబోతోంది జీ తెలుగు. కాకపోతే మెనూలో వంటకాలకి బదులు ఎంటర్టైన్మెంట్ వడ్డించబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్గా రిలీజ్ అయింది. అందులో కామెడీ మిస్సైల్ బ్రహ్మానందం సెంటరాఫ్ అట్రాక్షన్. ఎప్పటిలాగే తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. నాగబాబు.. సింగర్ రేవంత్‌తో కలిసి ‘భలే మంచి రోజూ..’ అంటూ పాట పాడాడు కూడా. మరో స్టార్ కమెడియన్ అలీ తన భార్య జుబేదా కోసం ఒక పాట పాడినట్టు ప్రోమోలో కనిపించింది.
నాగబాబు భార్య పద్మజ కూడా ఈ షోలో సందడి చేయబోతోంది. అలాగే ఈవెంట్లో బ్రహ్మానందం, అలీకి ఒక స్పెషల్ డాన్స్ ట్రిబ్యూట్ ప్లాన్ చేసింది జీ తెలుగు. యాంకర్ ప్రదీప్ స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఈ దావత్లో కనిపించ బోతున్నారు. ఇన్ని స్పెషల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ షో డిసెంబర్ 26న సాయంత్రం ఆరింటికి టెలికాస్ట్ కానుంది. ఈ టీవీ కూడా ఈ న్యూఇయర్‌కి ‘పెళ్లాం వద్దు పార్టీ ముద్దు’ ఈవెంట్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేసింది ఛానెల్. టీవీ సెలబ్రిటీలతో పాటు సినిమా స్టార్స్ కూడా సందడి చేయబోతున్న ఈ ఈవెంట్లో ఆర్జీవీ కూడా కనిపించబోతున్నాడు. ప్రోమోతోనే అంచనాలు పెంచేసిన ఈ షో డిసెంబర్–31 రాత్రి 9.30 నిమిషాలకి టెలికాస్ట్ అవనుంది.