36శాతం తగ్గిన 125సీసీ బైకుల అమ్మకాలు

36శాతం తగ్గిన 125సీసీ బైకుల అమ్మకాలు
  • మళ్లీ పెరుగుతుందంటున్న కంపెనీలు


చిన్న కార్లపై జనానికి మక్కువ తగ్గుతోంది. రేటు ఎక్కువైనా ఫర్లేదు.. ఖరీదైన కార్లే కావాలంటున్నారు. టూవీలర్​ మార్కెట్లోనూ ఎంట్రీ-లెవల్, నాన్-ఎలక్ట్రిక్ వెహికల్స్​కు డిమాండ్​ తగ్గుతోంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్​(సియామ్​) లెక్కల  ప్రకారం..110సీసీ మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైకిళ్ల అమ్మకాలు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్లో విపరీతంగా తగ్గాయి. నాలుగేళ్ల క్రితం ఇదే కాలంతో పోలిస్తే 42 శాతం తక్కువగా ఉన్నాయి. 125సీసీ స్కూటర్ల మార్కెట్ 36శాతం తగ్గిపోయింది.

న్యూఢిల్లీ:  ఇండియన్​ ఆటోమొబైల్​ కంపెనీలకు కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఎంట్రీ లెవల్ కార్లు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. కస్టమర్లు ఖరీదైన కార్లవైపు చూస్తున్నారు. ఎంట్రీ లెవల్ కార్లకు బదులు హైఎండ్​ మోడల్స్​ను ఇష్టపడుతున్నారు. 2016–-17లో భారతదేశంలో అమ్మడైన ప్రతి రెండు కార్లలో దాదాపు ఒక కారు.. ఎంట్రీ లెవల్ వెహికలే!  ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో భారతదేశంలో మొత్తం ప్యాసింజర్ వెహికల్స్​ అమ్మకాల్లో బడ్జెట్​ సెగ్మెంట్ అమ్మకాలు 42 శాతం పడిపోయాయని కంపెనీలు చెబుతున్నాయి. టూవీలర్​ వెహికల్​ మార్కెట్లో కూడా ఎంట్రీ-లెవల్, నాన్-ఎలక్ట్రిక్ బండ్లకు ఆదరణ తగ్గుతోంది.

సియామ్​ లెక్కల ప్రకారం, 110సీసీ మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైకిళ్ల అమ్మకాలు నాలుగేళ్ల క్రితం జూన్​ క్వార్టర్​తో పోలిస్తే 42శాతం తక్కువగా ఉన్నాయి. 125సీసీ స్కూటర్ల మార్కెట్ 36శాతం తగ్గిపోయింది. కస్టమర్ ఆసక్తి స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్​ వైపు మళ్లుతున్నట్లు కనిపిస్తున్నది. సబ్– కాంపాక్ట్ ఎస్​యూవీలతో సహా అనేక మోడళ్లు కూడా ఈ విభాగంలో విడుదలవుతున్నాయి. అయినప్పటికీ  ఎంట్రీ లెవల్ కార్ల సెగ్మెంట్​ను వదిలిపెట్టబోమని మారుతీ సుజుకి ప్రకటించింది.  2024 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ రకం కార్లకు గిరాకీ మళ్లీ వస్తుందని మారుతీ సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు.  
ఇండియాలో టూవీలర్లు తక్కువే...

అనేక ఇతర ఆసియా దేశాల కంటే భారతదేశంలో టూ వీలర్‌‌ వెహికల్స్​ వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. అలాగే అనేక రాష్ట్రాల్లో టూవీలర్ల వాడకం​ జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. ఈ విషయాలను బట్టి చూస్తే  ఎంట్రీ లెవెల్​ సెగ్మెంట్​ మంచి భవిష్యత్​ ఉందని హీరో మోటోకార్ప్ ప్రతినిధి ఒకరు అన్నారు.  ఆధార్ ఆధారిత లోన్లు, పంట-దిగుబడి ఆధారిత కిస్తీలు, క్యాష్​ బోనస్,  తక్కువ డౌన్ పేమెంట్ వంటి సదుపాయాల ద్వారా ఇన్​ఫ్లేషన్​ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు.

హోండా మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైకిల్ & స్కూటర్ ఇండియా కూడా త్వరలో 100సీసీ మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైకిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేయనుంది. ఇది ఇప్పటి వరకు 100 సీసీ బండిని లాంచ్​ చేయలేదు. దీంతో మిగతా కంపెనీలూ ఈ సెగ్మెంట్​పై ఫోకస్​ చేస్తాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వింకేష్ గులాటి అన్నారు.  రాబోయే పండుగ సీజన్ ఎంట్రీ-లెవల్ టూ-వీలర్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూసుకెళ్తుందని చెప్పారు. అమ్మకాలు తగ్గిపోతున్నప్పటికీ కంపెనీలు నిరాశపడటం లేదు. ప్రస్తుతం మనదేశంలో 100 సీసీ బండ్ల వాటా 35–-37శాతం ఉందని, ఇకముందు ఇంకా పెరుగుతుందని హోండా మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైకిల్ & స్కూటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అట్సుషి ఒగాటా తెలిపారు.