సిటీలకు బస్సుల్నే పోతున్రు

సిటీలకు బస్సుల్నే పోతున్రు

ఇంటర్ సిటీ ట్రైన్లలో తగ్గుతున్న ప్యాసింజర్లు 

రానున్న కాలంలో రైల్వే ఆదాయం మరింత తగ్గనుంది. ముఖ్యంగా శతాబ్ది, తేజస్ లాంటి ఇంటర్ సిటీ రైళ్లలో ప్రయాణికుల సంఖ్య పడిపోనుంది. దేశంలోని ప్రధాన నగరాలకు రోడ్డు రవాణా సదుపాయాలు ఉండడం, ఆయా సిటీలకు లగ్జరీ బస్సులు అందుబాటులో ఉండడమే దీనికి కారణమని తెలుస్తోంది. శతాబ్ది, తేజస్ లాంటి రైళ్లలో ఏసీ చైర్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణికుల సంఖ్య ఈ ఏడాది తగ్గే అవకాశం ఉందని రైల్వే అంచనా వేసింది.  పోయిన ఫైనాన్షియల్ ఇయర్ (2018–19)లో వీటిలో 3.5 కోట్ల మంది ప్రయాణం చేయగా, అది ఈసారి (2019–20) 3.38 కోట్లకు పడిపోనుందని తేల్చింది. ఈ నేపథ్యంలో  రైల్వే ఆదాయం తగ్గనుంది. మరోవైపు మరిన్ని తేజస్ రైళ్లు ప్రవేశపెట్టాలని ఈసారి బడ్జెట్ లో పేర్కొన్న ప్రభుత్వం, వాటి ఏర్పాటుపై ఆలోచించాల్సిన అవసరముంది.

ఏసీ క్లాసుల్లో పెరుగుతున్రు

మరోవైపు ఏసీ 1,2,3 క్లాస్ లలో  ప్రయాణించే వారి సంఖ్య మాత్రం పెరుగుతోందని రైల్వే పేర్కొంది. పోయినేడాదితో పోలిస్తే ఈసారి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఏసీ ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్ల సంఖ్య కొంచెం పెరిగే అవకాశం ఉండగా, మిగతా రెండు క్లాసుల ప్యాసింజర్ల సంఖ్య ఎక్కువగానే పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రభుత్వం రైల్వే బడ్జెట్ లో పేర్కొన్న లెక్కల ప్రకారం ఏసీ 1,2,3 కంపార్ట్ మెంట్లలో పోయిన ఫైనాన్షియల్ ఇయర్ (2018–19)లో 13.8 కోట్ల మంది ప్రయాణించగా, ఈసారి (2019–20) ఆ సంఖ్య 14.3 కోట్లకు పెరిగే అవకాశం ఉందని ఎస్టిమేషన్ వేసింది.
అదే రానున్న ఫైనాన్షియల్ ఇయర్ (2020–21)లో ఈ సంఖ్య 14.4 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.

రైల్వేకు సవాలే…

ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ క్లాస్, ఏసీ చైర్ కార్ ప్యాసింజర్ల సంఖ్య పెంచడం రైల్వేకు సవాల్ గా మారింది. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ (2020–21) ప్యాసింజర్లను సంఖ్యను 3.53 కోట్లకు పెంచాలని టార్గెట్ పెట్టుకుంది. అయితే ఇది చాలా కష్టమని అధికారులు పేర్కొంటున్నారు. ‘‘ప్రస్తుతం దేశంలోని సిటీల మధ్య బెటర్ రోడ్స్, హైక్వాలిటీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ–జైపూర్, ఢిల్లీ–చండీగఢ్, ఢిల్లీ–లక్నో, పుణె–ముంబై లాంటి సిటీలకు బస్సు ప్రయాణం రైల్వేకు పర్ ఫెక్ట్ ఆల్టర్నేట్ జర్నీగా మారింది. ఈ నేపథ్యంలో ప్యాసిం జర్లను తిరిగి రైల్వే కు తీసుకురావడం కష్టమైన పని. మరోవైపు ఏసీ 1, 2 క్లాసులలో ప్యాసింజర్ల సంఖ్య పెరగడాన్ని బట్టి ప్రయాణికులు రిలాక్స్ డ్ జర్నీ కోరుకుంటున్నారు” అని అర్థమవుతోందని అధికారులు వివరించారు. తేజస్ రైళ్లలో సీటింగ్ ఫెసిలిటీ మాత్రమే ఉండడం ఇందుకు మరో కారణమని పేర్కొన్నారు.

see also: పిల్లి కాదు.. పులి

మరిన్ని వార్తల కోసం