ద్రవిడ్ సార్ నమ్మకమే నన్ను ఆడించింది

ద్రవిడ్ సార్ నమ్మకమే నన్ను ఆడించింది

కొలంబో: పేసర్ దీపక్ చహర్ అద్భుతమైన బ్యాటింగ్ పటిమతో శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా విక్టరీ సాధించింది. తద్వారా సీరీస్ ను కైవసం చేసుకుంది. కీలక బ్యాట్స్ మెన్ అందరూ పెవిలియన్ చేరిన సమయంలో మరో బౌలర్ భువనేశ్వర్ కుమార్ సాయంతో జట్టును విజయతీరాలకు చేర్చిన చహర్ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోయేదిగా చెప్పొచ్చు. మ్యాచ్ తర్వాత చహర్ మాట్లాడుతూ.. కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రోత్సాహం వల్లే బాగా ఆడగలిగానని చెప్పాడు. 

'ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో గెలవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అన్ని బంతులూ ఆడాలని రాహుల్ సార్ చెప్పారు. గతంలో ఇండియా ఏ టీంకు ఆడినప్పుడు కొన్ని ఇన్నింగ్స్ లో బాగా ఆడాను. అందుకే ద్రవిడ్ సార్ నన్ను నమ్మారు. నంబర్ 7లో నేను బ్యాటింగ్ చేయగలనని ఆయన నమ్మకం. ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలనేది నా కల. టార్గెట్ 50 పరుగులకు చేరినప్పుడు గెలవగలమని అనిపించింది. నేను కొన్ని రిస్కులు తీసుకున్నా. మొత్తానికి మేం నెగ్గాం. రాబోయే మ్యాచుల్లో నేను బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు' అని చహర్ సరదాగా వ్యాఖ్యానించాడు.