DeepikaPadukone: దీపికా పదుకొనే ‘రీల్’వరల్డ్ రికార్డు.. ఏకంగా 190 కోట్ల వ్యూస్.. ఆ రీల్లో ఏముందో చూశారా?

DeepikaPadukone: దీపికా పదుకొనే ‘రీల్’వరల్డ్ రికార్డు.. ఏకంగా 190 కోట్ల వ్యూస్.. ఆ రీల్లో ఏముందో చూశారా?

‘చదువు’.. ఉంటే సమాజంలో ఎంతో గుర్తింపు వస్తోంది. డబ్బు, హోదా, గౌరవం ఇలా ఏదైనా మన కాళ్ల ముందర ఉంటుంది. కానీ, చదువంతగా రానివాళ్ల పరిస్థితి ఎలా అంటే? అందుకు ఓ మార్గముంది. అదే సోషల్ మీడియా (Social Media). మనలో ఉన్న ఏ  టాలెంట్ కైనా సోషల్ మీడియా ఇపుడు ఆహ్వానం పలుకుతుంది. నటించడం, రాయడం, పాడటం, మోడలింగ్.. ఇలా ఏ కళారంగానికైనా.. కేరాఫ్.. సోషల్ మీడియా. ఎందుకంటే, ఇది ఒక్కసారి మనల్ని గుర్తించడం స్టార్ట్ చేస్తే.. ఎవ్వరొద్దన్నా ఆగదు. మనం ఎదిగేకొద్దీ.. అది మరింత ముందుకు తీసుకెళ్తోంది. ఏమి లేనివాడ్ని, అన్నీఉన్నా వాడ్ని.. ఎలాంటి సామరస్యం లేకుండా గుర్తిస్తుంది. జస్ట్ టాలెంటే.. ఇందుకు అనువైన మార్గం. మరి ఇప్పుడిదంతా ఎందుకంటారా? ఓ స్టార్ హీరోయిన్ చేసిన కొద్దిపాటి సెకన్ల రీల్.. కోట్లకొద్దీ వ్యూస్ దక్కించుకుంది. మరి ఆ హీరోయిన్ ఎవరు..? తాను చేసిన ఆ రీల్ ఏంటనేది ఓ లుకేద్దాం. 

లేటెస్ట్గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో పంచుకోవడం ద్వారా ఏకంగా వరల్డ్ రికార్డ్ సైతం బ్రేక్ చేసింది. ఆమె ఇటీవల హిల్టన్ అనే హోటల్ యాడ్ కోసం పని చేసింది. ఈ యాడ్కు సంబంధించిన వీడియోను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ఇంకేముంది? జూన్ 09న పోస్ట్ చేయబడిన ఈ రీల్ ఆగస్టు 4 నాటికి 1.9 బిలియన్ల వ్యూస్ (190కోట్ల వ్యూస్). ఇది ప్రపంచంలోనే అత్యధికంగా చూసిన రీల్‌గా నిలిచింది. 

ALSO READ : Dhanush,Mrunal: సోషల్ మీడియాను ఊపేస్తోన్న ధ‌నుష్‌, మృణాల్ డేటింగ్ రూమర్స్.. వీడియోలు వైరల్

ఈ కొత్త రికార్డుతో, హార్దిక్ పాండ్యా x BGMI (1.6 బిలియన్ వ్యూస్), ఫ్లెక్స్ యువర్ న్యూ ఫోన్ (1.4 బిలియన్ వ్యూస్) మరియు క్రిస్టియానో రొనాల్డో రీల్‌లను కూడా అధిగమించింది. ప్రస్తుతం ఈ భామకు ఇంస్టాగ్రామ్లో సుమారు 80 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అరుదైన రికార్డు సాధించడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీపిక పదుకునే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-అట్లీ కాంబోలో వస్తున్న మూవీలో నటిస్తుంది. త్వరలో ప్రభాస్ కల్కి 2 లో జాయిన్ అవ్వనుంది.

  • Beta
Beta feature