కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి వెళ్లిన ఓ విద్యార్థి తిరిగి రాలేదు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. అమీన్ పూర్ మండల పరిధిలోని ఐలాపూర్ గ్రామానికి చెందిన కుర్మ రాకేష్(21) అనే విద్యార్థి పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గీతం యూనివర్సిటీలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
ఏప్రిల్ 26 బుధవారం ఉదయం కాలేజీకి వెళ్తున్నానని వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. - కుటుంబ సభ్యులు ఫోన్ చేసి చూడగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. తెలిసిన వారు, బంధువుల వద్ద వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో రాకేష్ తండ్రి విట్టల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాకేష్ ఫొన్ అధారంగా పోలీసులు ట్రేజ్ చేస్తున్నారు.