ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఓటు గల్లంతు

 ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఓటు గల్లంతు

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ఎన్నికలకు ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు వచ్చిన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ చౌదరికి వింత అనుభవం ఎదురైంది. ఓటర్ల జాబితాలో కానీ, తొలగించిన జాబితాలో కానీ తన పేరు లేదని చౌదరి షాకయ్యారు. ఏం జరిగిందనే విషయంలో అధికారులు పరిశీలిస్తున్నట్టుగా అనిల్ చౌదరి తెలిపారు.  ఏకంగా ఒక జాతీయ పార్టీ అధ్యక్షుుడు ఓటు గల్లంతు అవడం ఇప్పుడు  చర్చనీయాంశంగా మారింది. అయితే పోలింగ్ బూత్‌కు వచ్చిన ఆయన భార్య మాత్రం ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యాయి. సాయంత్రం 5.30 వరకూ పోలింగ్ జరగనుంది. బీజేపీ, ఆప్, కాంగ్రెస్, తదితర పార్టీల తరఫున మొత్తం 1,349 మంది క్యాండిడేట్లు బరిలో ఉన్నారు. ఈ నెల 7న ఓట్ల కౌంటింగ్ చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో గత 15 ఏండ్లుగా బీజేపీ అధికారంలో ఉంది.