కేజ్రీవాల్ అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు

కేజ్రీవాల్ అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టులో చుక్కెదురైంది. అనారోగ్యం నిత్యా డాక్టర్ ను సంప్రదించేందుకు తనకు అనుమతి ఇవ్వాలన్న   కేజ్రీవాల్ అభ్యర్థనను  కోర్టు తిరస్కరించింది.  తీవ్రమైన మధుమేహం, రక్తంలో చక్కెర స్థాయి హెచ్చుతగ్గులకు సంబంధించి ప్రతిరోజూ 15 నిమిషాల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డాక్టర్ ను సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  తనకు ఇన్సులిన్ ఇచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.కాని,  కేజ్రీవాల్ కు కోర్టు అనుమతిని నికారించింది.

 అయితే, కేజ్రీవాల్ కు అవసరమైన వైద్య చికిత్స అందించాలని, ఏదైనా ప్రత్యేక సంప్రదింపులు అవసరమైతే ఎండోక్రినాలజిస్ట్, డయాబెటాలజిస్ట్‌లతో కూడిన AIIMS డైరెక్టర్‌చే ఏర్పాటు చేయబడిన మెడికల్ బోర్డుని సంప్రదించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.  కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ ఇవ్వాలా వద్దా అనేది మెడికల్ బోర్డు నిర్ణయించనుందని తెలిపింది. 

వైద్య బోర్డు సూచించిన ఆహారం, అనుసరించాల్సిన వ్యాయామ ప్రణాళికపై కూడా నిర్ణయం తీసుకుంటుందని కోర్టు తెలిపింది. మెడికల్ బోర్డు సూచించిన డైట్ ప్లాన్ నుండి ఇకపై ఎటువంటి వ్యత్యాసాలు ఉండకూడదని కోర్టు జైలు అధికారులకు స్పష్టం చేసింది.