కేజ్రీవాల్ డైట్ పై వివాదం... తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

కేజ్రీవాల్ డైట్ పై వివాదం...  తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ డైట్ వివాదంపై తీర్పు రిజర్వ్ చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయని.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రైవేట్ డాక్టర్ ను సంప్రదించడానికి అనుమతివ్వాలంటూ కోర్టును ఆశ్రయించారు. జైలు అధికారులు ఇన్సులిన్ అందించేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు కేజ్రీవాల్. డాక్టర్ తో మాట్లాడేటప్పుడు తన భార్య సునీతకు కూడా అనుమతించాలన్నారు కేజ్రీవాల్. 

కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మను సింఘ్వీ, రమేష్ గుప్త కోర్టులో వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ కు షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయని కోర్టుకు తెలిపారు. ప్రతిరోజు 15 నిమిషాలపాటు ప్రయివేట్ డాక్టర్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టు కోరారు.   

also read : లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి

మరోవైపు కేజ్రీవాల్ ఆరోగ్యం బాగానే ఉందన్నారు తీహార్ జైలు అధికారులు. షుగర్ లెవెల్స్ సరిగానే ఉన్నాయని కోర్టుకు తెలిపారు. జైలు డాక్టర్లు ఎప్పటికప్పుడు కేజ్రీవాల్ ను పరిశీలిస్తున్నారని చెప్పారు. అవసరమైతే కేజ్రీవాల్ కు జైల్లోనే ఇన్సులిన్ అందిస్తామన్నారు అధికారులు. ఎయిమ్స్ నివేదిక ప్రకారం షుగర్ ఉన్నవారు మామిడి, అరటి పండ్లు తీసుకోవద్దని కోర్టుకు తెలిపారు.  ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఏప్రిల్ 22కు తీర్పును వాయిదా వేసింది. రేపటిలోగా జైలు అధికారులు, ఈడీ స్పందించాలంది కోర్టు.  .