ఢిల్లీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి

ఢిల్లీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి

ఢిల్లీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న మాట నిజమే అన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అయితే ఈ విషయంలో అంతగా భయపడాల్సిన అవసరం మాత్రం లేదన్నారు. కరోనాతో అస్పత్రుల్లో చేరే వారి సంఖ్యా, మరణాల రేటు చాలా తక్కువగానే ఉంది. అందుకే ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పని లేదు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్​ కూడా కావాల్సినన్ని ఉన్నాయన్నారు. ఆక్సిజన్, మెడిసిన్స్​ కూడా అందుబాటులో ఉంచుతున్నామని కేజ్రీవాల్ తెలిపారు. మరోవైపు ఢిల్లీలో శుక్రవారం 24,383 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి 34 మంది చనిపోయారు. దీంతో ఢిల్లీలో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య  25,305కు చేరింది. దీంతో సిటీలో కోవిడ్ టెస్టుల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. లక్షణాలు ఉన్నవారు... తప్పకుండా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించింది.