
ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కట్టిడికి అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా శుక్రవారం ( మే 2) 400 ఎలక్ట్రిక్ బస్సులను సీఎం రేఖాగుప్తా ప్రారంభించారు. 2025 చివరినాటికి మరో 2080 బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఢిల్లీలో వాహనాలతో 45 శాతం కాలుష్యం సంభవిస్తుంది. వచ్చే ఏడాది నాటికి 100 శాతం ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ ను ఏర్పాటు చేసే దిశగా ఢిల్లీ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేఖాగుప్తా అన్నారు. రాజధాని రవాణాను బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విధానంపై పనిచేస్తోందని చెప్పారు.
Also Read : రాహుల్ గాంధీ, సోనియాకు నోటీసులు
మరోవైపు దేశరాజధాని ఢిల్లీలో శనివారం ఉదయం భారీ వర్షాలు కురిశాయి. ఢిల్లీ వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై చెట్లుకూలిపోవడంతో ట్రాఫిక్ జామ్ తో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెట్టుకూలి ఓ ఇంటిపై పడటంలో ముగ్గురు పిల్లలో సహా తల్లి చనిపోయింది.
ఢిల్లీలో భారీ వర్షాలకు ప్రభావితం అయిన ప్రాంతాలను సీఎం రేఖాగుప్తా పరిశీంచారు. సహాయ చర్యలను మంత్రుల, అధికారులతో పర్యవేక్షించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలు బాధపడకుండా అన్ని చర్యలు చేపట్టామని రేఖా గుప్తా చెప్పారు.