
న్యూఢిల్లీ: కరోనా బారిన పడి తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం రూ.50 వేల ఆర్థిక సాయం అందజేసింది. మొత్తం 21,235 ఫ్యామిలీలకు రూ.50 వేల చొప్పున ఒకేసారి అందించామని ఢిల్లీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ రాజేంద్ర పాల్ గౌతమ్ సోమవారం తెలిపారు. ‘ముఖ్యమంత్రి కొవిడ్ 19 పరివార్ ఆర్థిక సహాయ యోజన’కింద ఈ సాయం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కరోనాతో కుటుంబ యాజమాని చనిపోయిన ఫ్యామిలీలకు, తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు నెలనెలా రూ.2,500 చొప్పున సాయం అందిస్తున్నామని చెప్పారు. దీని కోసం 12,668 అప్లికేషన్లు వచ్చాయని, అందులో 9,484 అప్లికేషన్లను అప్రూవ్ చేసినట్లు తెలిపారు. వీరందరికీ నెలకు రూ.2,500 చొప్పున పింఛన్ మంజూరు చేసినట్లు వెల్లడించారు.