
తన రాష్ట్ర ప్రజలకోసం కీలక నిర్ణయం తీసుకున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కేంద్రం ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ ను ఫ్రీగా ఇవ్వకుంటే ..తామే ఢిల్లీ వాసులకు ఉచితంగా అందిస్తుందని బుధవారం తెలిపారు. ఢిల్లీ ప్రజలకు ఫ్రీగా కరోనా వ్యాక్సిన్ సరఫరా చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ఆయన మరోసారి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
కరోనా విధి నిర్వహణలో చనిపోయిన డాక్టర్ హితేష్ గుప్తా కుటుంబాన్ని పరామర్శించిన కేజ్రీవాల్.. వ్యాక్సిన్ గురించి ఎవరూ తప్పుగా ప్రచారం చేయవద్దని కోరారు. కరోనా టీకాను అందరికీ ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానని…దీనికి అంగీకరించకపోతే ఢిల్లీ ప్రజలకు తామే ఉచితంగా వ్యాక్సిన్ ను అందిస్తామని ప్రకటించారు.
కరోనా వ్యాక్సిన్ను దేశ ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలని గతంలో ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు సీఎం కేజ్రీవాల్. టీకా ప్రతి ఒక్కరి హక్కు అన్నారు.