ఎవరైనా ఆక్సిజన్ సప్లైని అడ్డుకుంటే ఉరిశిక్షే

ఎవరైనా ఆక్సిజన్ సప్లైని అడ్డుకుంటే ఉరిశిక్షే

దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో ఆక్సిజన్ సప్లైపై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఆక్సిజన్ సప్లైని ఎవరైనా అడ్డుకుంటే వారిని ఉరి తీస్తామని హెచ్చరించింది.  ఆక్సిజన్‌ కొరతపై ఢిల్లీలోని మహారాజ అగ్రసేన్‌ ఆస్పత్రి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు..ఆక్సిజన్‌ సరఫరాకు ఆటంకం కల్గించే వారికి సంబంధించి ప్రభుత్వం ఎవరిమీద అయినా తమకు ఫిర్యాదు చేస్తే కోర్టు..ఆ వ్యక్తిని తప్పక ఉరి తీస్తామని హెచ్చరికలు జారీచేసింది. ప్రజల ప్రాణాలకు సంబంధించి ఎంత పెద్ద అధికారి అయినా సరే తప్పు చేస్తే శిక్ష తప్పదని  అధికారుల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు .