హైకోర్టులో జుహీ చావ్లాకు ఊరట

హైకోర్టులో జుహీ చావ్లాకు ఊరట

బాలీవుడ్ నటి జూహీ చావ్లాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను గతంలో న్యాయస్థానం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. గతంలో ఈ విషయంలో జూహీకి విధించిన జరిమానాను కోర్టు తగ్గించింది. రూ. 20 లక్షల జరిమానను.. రెండు లక్షలకు తగ్గించింది.దీంతో పాటు దేశంలో 5G వైర్‌లెస్ నెట్‌వర్క్‌ల ఏర్పాటుకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టివేసేటప్పుడు సింగిల్ జడ్జి చేసిన అనేక పరిశీలనలను కూడా బెంచ్ తొలగించింది. టెక్నాలజీ అన్న తరువాత కచ్చితంగా అప్‌గ్రేడ్‌ కావాల్సిందేనని హైకోర్టు గతంలో స్పష్టం చేసింది. ఈ అంశంపై కోర్టును ఆశ్రయించడానికి ముందే ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందని అభిప్రాయపడింది. 

అయితే మరోవైపు ఈ కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు జూహీ అభిమాని సినిమా పాటలు వినిపించటం.. ప్రొసీడింగ్స్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలకు పాల్పడటంపై సీరియస్‌ అయింది. జూహీ చావ్లాతోపాటు పలువురికి రూ.20లక్షల జరిమానా విధించింది. అంతకుముందు 5-జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా ప్రముఖ బాలీవుడ్ నటి, పర్యావరణ కార్యకర్త జూహీ చావ్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 5-జీ వైఫై టెక్నాలజీ వల్ల విడదలయ్యే రేడియేషన్ ప్రజలకు, పర్యావరణానికి హానికరమని ఆమె తన పిటిషన్‌లో తెలిపారు. ఈ విషయమై ఒక మీడియా ప్రకటన విడుదల చేస్తూ సాంకేతిక పురోగతికి తాను వ్యతిరేకం కాదని జూహీ స్పష్టం చేశారు. 
 

ఇవి కూడా చదవండి:

ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ కు మరో షాక్

ముంబయికి మరో 900 డబుల్ డెక్కర్ ఎలక్ట్రిసిటీ ఏసీ బస్సులు