Liquor scam case : సప్లిమెంటరీ ఛార్జ్షీట్పై ఫిబ్రవరి 2న కోర్టు నిర్ణయం

Liquor scam case : సప్లిమెంటరీ ఛార్జ్షీట్పై ఫిబ్రవరి 2న కోర్టు నిర్ణయం

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకోవడంపై ఫిబ్రవరి 2న నిర్ణయం తీసుకుంటామని రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించింది. అదే రోజున ఆర్డర్ ఇవ్వనున్నట్లు చెప్పింది. లిక్కర్ స్కాంకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిసెంబర్ 6న 13,657 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తొలి ఛార్జ్ షీట్ లో ఏ1గా సమీర్ మహేంద్రు, ఏ2, ఏ3, ఏ4, ఏ5లుగా ఆయనకు సంబంధించిన కంపెనీల పేర్లు చేర్చింది. సప్లిమెంటరీ ఛార్జ్ షీటులో ఈడీ ఐదుగురు వ్యక్తులు, 7 కంపెనీల పేర్లతో పాటు సౌత్ గ్రూప్, రూ.100కోట్ల మనీ లాండరింగ్ అంశాలను ప్రస్తావించింది. ఈడీ ఇప్పటి వరకు  సమీర్ మహేంద్రుతో పాటు శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్,  అమిత్ అరోరాలకు లిక్కర్ స్కాంతో సంబంధమున్నట్లు తేల్చింది.