ఇయ్యాల ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు

ఇయ్యాల ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు
  • ఇయ్యాల ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు
  • బీజేపీ, ఆప్, కాంగ్రెస్ మధ్య పోటీ 
  • ఈ నెల 7న ఓట్ల కౌంటింగ్.. ఫలితాలు  

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లో ఉన్న 250 వార్డులకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకూ పోలింగ్ జరగనుంది. బీజేపీ, ఆప్, కాంగ్రెస్, తదితర పార్టీల తరఫున మొత్తం 1,349 మంది క్యాండిడేట్లు బరిలో ఉన్నారని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

ఎంసీడీ పరిధిలో 1,45,05,358 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 78లక్షల మంది పురుషులు, 66 లక్షల మంది మహిళలు, 1,061 మంది ట్రాన్స్ జెండర్లు. మొత్తం 13,638 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 7న ఓట్ల కౌంటింగ్ చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నట్లు వివరించారు. కాగా, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలకు ప్రధానంగా ఆప్, బీజేపీ పోటాపోటీగా ప్రచారం చేశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ కు కూడా బలమైన క్యాడర్ ఉండటంతో త్రిముఖ పోటీ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.