ప్రశాంతంగా కొనసాగుతున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు 

ప్రశాంతంగా కొనసాగుతున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు 

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు. సాయంత్ర 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 7న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈస్ట్, సౌత్, నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేసి, ఎంసీడీగా మార్చిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 250 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆప్, కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. మొదటి సారి మున్సిపల్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తుంది ఎంఐఎం పార్టీ. 

15 ఏళ్ల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీనే గెలుస్తూ వస్తోంది. దీంతో ఈ ఏడాది ఆప్ విజయం సాధించాలనే లక్ష్యంతో ఆ పార్టీ నేతలు విస్తృత ప్రచారం చేశారు. ఈసారి MCD ఎన్నికల కోసం హోరాహోరిగా ప్రచారం సాగింది. బీజేపీ కేంద్ర మంత్రులు కూడా ప్రచారం నిర్వహించారు. ఇక ఆప్ పది హామీల పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రచారం జోరుగా చేసింది. బీజేపీ పాలనలో ఏం మారలేదంటూ...ఆప్ ను గెలిపించాలంటూ ప్రచారం చేసింది. 2017లో జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో బీజేపీ 250 స్థానాలకు 181 స్థానాలు గెలుచుకొని అధికారం చేజిక్కించుకుంది.