
Robert Vadra: ప్రముఖ వ్యాపారవేత్త, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఆయనకు ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కోర్టు నోటీసులు అందాయి. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు వాద్రాకు శుక్రవారం దీనికి సంబంధించిన నోటీసులను జారీ చేసింది.
కోర్టు నోటీసులు వాద్రాతో పాటు మరికొందరు వ్యక్తులు సంస్థలకు పంపబడ్డాయని వెల్లడైంది. ఈడీ ఇటీవల మనీలాండరింగ్ వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులతో పాటు 8 కంపెనీల పేర్లను తన ఛార్జ్ షీటులో పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కోర్టు వాదనలు ఆగస్టు 28న ఉంటాయని వెల్లడైంది. నేరారోపణలు మోపటానికి ముందు చట్టప్రకారం జరిగే ప్రక్రియ ఇదిని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఆగస్టు 28న జరిగే విచారణలో ED కేసు వాదనలతో కోర్టు సంతృప్తి చెందిందా లేదా అనే విషయం తెలుస్తుంది. దీని తర్వాత కేసును మరింత ముందుకు తీసుకెళ్లడానికి మార్గం సుగమం కానుంది. వాస్తవానికి హర్యాణా-రాజస్థాన్ లోని భూ ఒప్పందాలకు సంబంధించి మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలపై ఈడీ చేపట్టిన దర్యాప్తులో భాగంగా ప్రస్తుతం రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు పంపింది.