లిక్కర్ పై స్పెషల్ కరోనా ఫీజు తొలగింపు

లిక్కర్ పై స్పెషల్ కరోనా ఫీజు తొలగింపు
  • ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం

న్యూఢిల్లీ: మద్యం ప్రియులకు ఢిల్లీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. మద్యం అమ్మకాలపై 70 శాతం స్పెషల్ కరోనా ఫీజును క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, అన్ని రకాల మద్యంపై వ్యాట్ ను 20 నుంచి 25 శాతం పెంచినట్లు ప్రకటించింది. ఈ ఆదేశాలు ఈ నెల 10 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. అదివారం జరిగిన మంత్రివర్గ సమవేశంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్.. మద్యం అమ్మకాలపై కరోనా ఫీజు ఎత్తివేస్తున్నామని చెప్పారు. లాక్ డౌన్ సడలింపులపై పలు కీలక అంశాలను వెల్లడించారు. కరోనావైరస్ లాక్​డౌన్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కిందటి నెలలో ఢిల్లీ సర్కారు ‘స్పెషల్ కరోనా ఫీజు’ పేరిటి మందు బాటిళ్లపై 70 శాతం అదనంగా ఫీజు విధించిన సంగతి తెలిసిందే.