వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప.. క్యాచ్ అందుకున్న డెలివరీ బాయ్

వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప.. క్యాచ్ అందుకున్న డెలివరీ బాయ్

వియత్నాంలో అద్భుతం జరిగింది. 12 అంతస్తుల భవనంపై నుంచి పడిన చిన్నారిని ప్రాణాలతో కాపాడాడు ఒక డెలివరీ ట్రక్ డ్రైవర్. వియత్నాంలోని హనోయ్ ఏరియాలో ఫిబ్రవరి 28 ఆదివారం సాయంత్రం 4:30 గంటల సమయంలో జరిగిందీ ఘటన. స్థానికంగా ఉన్న 12 అంతస్తుల భవనంలోని ఫ్లాట్ నుంచి ఒక పాప బాల్కనీలోకి వచ్చింది. అక్కడి నుంచి గ్రిల్స్ దాటి బయటకు వచ్చింది. అది చూసిన చుట్టుపక్కల ఫ్లాట్స్ వాళ్లు గట్టిగా అరిచారు. అదే సమయంలో నుయెన్ నోక్ మన్ ఒక పార్శిల్ డెలివరీ చేయడం కోసం తన ట్రక్కుతో అక్కడకు వచ్చాడు. స్థానికుల అరుపులు విన్న నోక్ మన్ వెంటనె ట్రక్కు నుంచి కిందికి పైకి చూశాడు. బాల్కనీ నుంచి అప్పుడే పాప జారి కిందకు పడుతుండగా.. నోక్ మన్ స్పందించి పాపను తన చేతుల్లోకి అందుకున్నాడు. దాంతో పాపకు ఎటువంటి హానీ కలగలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.