సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో డీమార్ట్ నికర లాభం 10,638 కోట్లు

 సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో డీమార్ట్ నికర లాభం 10,638 కోట్లు

న్యూఢిల్లీ: డీమార్ట్ పేరుతో రిటైల్ స్టోర్లను నిర్వహించే అవెన్యూ సూపర్‌‌‌‌మార్ట్స్‌‌ రెవెన్యూ (కన్సాలిడేటెడ్‌‌) ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌లో రూ. 10,638.33 కోట్లకు పెరిగింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో జనరేట్ అయిన రెవెన్యూ రూ.7,788.94 కోట్లతో పోలిస్తే ఇది 36.58 శాతం ఎక్కువ. కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 64.13 శాతం పెరిగి రూ.685.71 కోట్లకు చేరుకుంది.

కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో ఇది రూ.417.76 కోట్లుగా ఉంది. క్లాత్స్‌‌, మర్చంటైజ్‌‌ సెగ్మెంట్‌‌లతో పోలిస్తే ఎఫ్‌‌ఎంసీజీ (సబ్బులు, షాంపూలు వంటివి) సెగ్మెంట్ బాగా పెర్ఫార్మెన్స్ చేసిందని కంపెనీ సీఈఓ నెవెల్లీ నోరొన్హో అన్నారు. నాన్ ఎఫ్‌‌ఎంసీజీ సెగ్మెంట్‌‌లోని కొన్ని ప్రొడక్ట్‌‌ల సేల్స్ ఇంకా కరోనా ముందు స్థాయికి చేరుకోలేదని వివరించారు.