బదిలీని బేఖాతరు చేసిన డిప్యూటీ కలెక్టర్ షర్మిల సస్పెన్షన్

బదిలీని బేఖాతరు చేసిన డిప్యూటీ కలెక్టర్ షర్మిల సస్పెన్షన్
  • ఉత్తర్వులు జారీ చేసిన సీసీఎల్ఏ కమిషనర్ లోకేశ్ కుమార్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ బదిలీ ఉత్తర్వులను లెక్క పెట్టకుండా, విధుల్లో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శించిన డిప్యూటీ కలెక్టర్ ఎం.షర్మిలపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ప్రస్తుతం హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏలో డిప్యుటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉన్న ఆమెను మే 4న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఆర్డీఓగా (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

అయితే, నిర్దేశించిన గడువులోగా ఆమె కొత్త పోస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరకపోవడంతో జిల్లాలో సర్ మ్యాపింగ్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడిందని ప్రభుత్వం పరిగణించింది. ఈ క్రమంలో టీసీఎస్ (సీసీఅండ్​ఏ) నియమావళి-1991లోని రూల్ 8 ప్రకారం.. షర్మిలను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. సస్పెన్షన్ కాలంలో షర్మిల ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.