
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజుల పాటు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వెంకటరావు తెలిపారు. అనుబంధ ఆలయమైన పర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి(శివాలయం) క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే రుద్రహోమాన్ని తాత్కాలికంగా రద్దు చేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 2న దసరా సందర్భంగా ప్రధానాలయ తూర్పు రాజగోపురం ఎదుట శమీపూజ నిర్వహిస్తామని చెప్పారు. నవరాత్రి పూజల్లో పాల్గొనే భక్తుల కోసం టికెట్ ధరను రూ.1,116 గా నిర్ణయించామని, టికెట్ పై దంపతులిద్దరిని అనుమతిస్తామని పేర్కొన్నారు.