యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, వ్రత మండపం, కొండపైన బస్‌బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. రద్దీ కారణంగా నారసింహుడి ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అరగంట సమయం పట్టింది.
పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.48,86,826 ఆదాయం వచ్చింది. ఇందులో ప్రసాద విక్రయం ద్వారా రూ.18,71,585, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.6,87,500, వీఐపీ దర్శనాల ద్వారా రూ.9.45 లక్షలు, బ్రేక్‌దర్శనాలతో రూ.3,69,300 ఆదాయం వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు.
