మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన ఇస్లావత్బాలాజీ ఇంటి ఎదుట ఉన్న వేపచెట్టు నుంచి వారం రోజులుగా పాల లాంటి ద్రవం కారుతోంది. స్థానికులు ఆసక్తిగా చూస్తున్నారు. గాయమైనప్పుడు లేదా ఫంగస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు చెట్టు తనను తాను రక్షించుకోవడానికి పాల వంటి తెల్లటి జిగురును స్రవిస్తుందని, ఇది ఒక సహజ ప్రక్రియ అని వ్యవసాయ అధికారులు తెలిపారు.
- మేళ్లచెరువు, వెలుగు
