
భద్రాచలం, వెలుగు : 2026లో సీతారాముల కల్యాణం కోసం గోటితో వలిచిన కోటి తలంబ్రాలను తయారు చేసేందుకు వరి సాగు కోసం వడ్ల గింజలకు ఆదివారం భద్రాచలం రాముని సన్నిధిలో పూజలు చేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాకు చెందిన శ్రీరామదాసు భక్తమండలి భక్తులు భక్తి ప్రవత్తులతో వడ్లను తీసుకొచ్చారు.
మేళతాళాల మధ్య ఆలయంలోకి తీసుకురాగా వేదపండితులు వాటికి పూజలు జరిపించారు. 9 ఏండ్లుగా శ్రీరామదాసు తిరుపతి అనే భక్తులు తన వ్యవసాయ క్షేత్రంలో సీతారాముల కల్యాణం కోసం తలంబ్రాల తయారీకి వరి పంటను అత్యంత నిష్టతో సాగు చేస్తున్నారు. పూజలనంతరం అర్చకులు వడ్లను వారికి అందించారు.