NBK 109లో ఐటెం క్వీన్ అండ్ యంగ్ హీరో..బాబోయ్‌ ఇన్ని తట్టుకోగలమా?

NBK 109లో ఐటెం క్వీన్ అండ్ యంగ్ హీరో..బాబోయ్‌ ఇన్ని తట్టుకోగలమా?

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) లేటెస్ట్ ఫిల్మ్ (NBK109) ని బాబీ డైరెక్షన్లో చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కూడా చాలా విభిన్నమైన యాక్షన్..ఎమోషన్తో పాటు సోషల్ మెసేజ్ను టచ్ చేస్తూ వస్తుంది. ఈ మూవీని నిర్మాత నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చూన్ త్రివిక్రమ్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రీసెంట్గా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయింది.అయితే ఈ సినిమాలో నెగిటివ్ రోల్లో బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్ బాబీ డియోల్‌ నటిస్తున్న విషయం తెలిసిందే.తాజా సమాచారం ప్రకారం..ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా(Urvashi Rautela).ఒక హీరోయిన్‌ గా నటిస్తున్నట్లుగా టాక్. ఎందుకంటే NBK 109 లో బాలయ్య డ్యూయల్ రోల్ కనుక మరో హీరోయిన్ ఊర్వశి ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 

ALSO READ : తలపతి సినిమాలో రతికా రోజ్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ

బాలీవుడ్,టాలీవుడ్ మోస్ట్ ట్రెండింగ్ ఐటెం క్వీన్ గా తన సత్తా చాటుతోంది ఊర్వశీ రౌతేలా.అందంతో, తన డ్యాన్స్తో కుర్రకారును ఊపేస్తున్న ఈ భామ ప్రస్తుతం వరుస ఐటెమ్ సాంగ్స్తో క్రేజీ సంపాదించుకొంది.వరుసగా టాలీవుడ్ లో నాలుగు ఐటెం సాంగ్స్లో యాక్ట్ చేసి..కుర్రాళ్లకు హీటెక్కించేస్తోంది. మరి బాలయ్య సరసన అంటే మాస్ హీట్ పెంచుతుందేమో!

ఇదిలా ఉండగా..ఇందులో టాలీవుడ్‌ కు చెందిన ఒక యంగ్‌ హీరో స్పెషల్ రోల్ చేస్తున్నట్టు సినీ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. స్పెషల్ రోల్ అంటే సైడ్ హీరోగా అనుకునేరు.నెగిటివ్‌ పాత్రలో కనిపించబోతున్నాడు.మలయాళ యాక్టర్ షైన్‌ టామ్‌ చాకో ఈ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. అంటే..షైన్‌ టామ్‌ చాకో కి తమ్ముడి క్యారెక్టర్ లో ఈ యంగ్ హీరో నటిస్తున్నాడట.మరి ఇన్ని సర్ ప్రైజ్స్ తో బాబీ తెరకెక్కిస్తున్న NBK 109 ఏ రేంజ్ లో ఉండనుందో అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ అంటే బాలకృష్ణ అని చెప్పొచ్చు.ఆయన సినిమాల్లో మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకు వీరమాస్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

  • Beta
Beta feature