బీఆర్‌‌‌‌ఎస్‌‌కు షాక్‌‌.. క్యాతనపల్లి మున్సిపాలిటీలో వీగిన అవిశ్వాసం

బీఆర్‌‌‌‌ఎస్‌‌కు షాక్‌‌.. క్యాతనపల్లి మున్సిపాలిటీలో వీగిన అవిశ్వాసం
  •     కాంగ్రెస్​ వశమైన మున్సిపాలిటీ సొంతం
  •     కోరం లేకపోవడంతో వీగిపోయినట్లు ప్రకటించిన అధికారులు 
  •     పట్టు నిలుపుకున్న ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, కాంగ్రెస్​ లీడర్లు 

కోల్​బెల్ట్​,వెలుగు: క్యాతనపల్లి మున్సిపాలిటీలో కోరం లేకపోవడంతో  మున్సిపల్​ చైర్‌‌‌‌పర్సన్‌‌, వైస్​ చైర్మన్​పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. బీఆర్‌‌‌‌ఎస్‌‌కు షాక్​ ఇస్తూ మున్సిపాలిటీని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మంగళవారం మంచిర్యాల ఆర్డీవో,  ప్రిసైడింగ్​ ఆఫీసర్​ రాములు సమక్షంలో అవిశ్వాస  తీర్మాన మీటింగ్​ ఏర్పాటు చేశారు.  

బీఆర్‌‌‌‌ఎస్‌‌ వర్గపోరు కారణంగా ఈ పార్టీకి చెందిన మెజార్టీ కౌన్సిలర్లు,  చైర్​పర్సన్​ జంగం కళ, వైస్​ చైర్మన్​ సాగర్​రెడ్డిపై అవిశ్వాసం ప్రకటించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు  చైర్‌‌‌‌పర్సన్​, 12.30 గంటలకు వైస్​ చైర్మన్‌‌పై  అవిశ్వాస మీటింగ్​ ఏర్పాటు చేశారు.  ఆరుగురు బీఎస్ఆర్​ కౌన్సిలర్లు రాగా వారి సంతకాలు తీసుకొని మీటింగ్​ హాలులో కూర్చొబెట్టారు.  గంటకు పైగా ఎదురు చూసినా మీటింగ్​ నిర్వహణకు అవసరమైన కోరం రాలేదు.  దీంతో మీటింగ్‌‌ను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

మధ్యాహ్నం 1.45 గంటలకు మరో ఏడుగురు బీఆర్ఎస్​ కౌన్సిలర్లు మున్సిపల్​ ఆఫీస్​ చేరుకున్నారు.  మధ్యాహ్నం 2  తర్వాత మీటింగ్‌‌ను తిరిగి ప్రారంభించారు.  మొత్తం 22 మంది  సభ్యుల్లో 2/3 వంతు 15 మంది కోరంకు అవసరం కాగా బీఆర్‌‌‌‌ఎస్​ కౌన్సిలర్లు 13 మంది మాత్రమే హాజరయ్యారు.  చైర్‌‌‌‌పర్సన్​, వైస్​ చైర్మన్​తో పాటు 9 మంది కాంగ్రెస్​ కౌన్సిలర్లు అవిశ్వాస మీటింగ్​కు హాజరుకాలేదు.  

సాయంత్రం 3 గంటల సమయంలో  చైర్ పర్సన్​ జంగం కళ, వైస్​ చైర్మన్​ సాగర్​రెడ్డిపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయిందని ఆర్డీవో  రాములు ప్రకటించారు.  మందమర్రి తహసీల్దార్​ చంద్రశేఖర్​, మున్సిపల్​ కమిషనర్​ వెంకటనారాయణ, మేనేజర్​ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు 

క్యాతనపల్లి మున్సిపల్​ చైర్‌‌‌‌పర్సన్, వైస్‌‌ చైర్మన్‌‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.  మంగళవారం సాయంత్రం మున్సిపల్​ఆఫీస్​ ఎదుట పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని ఉత్సవాలు నిర్వహించారు.  ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ధన్యవాదాలు తెలిపారు.  

ఉదయం నుంచి టెన్షన్...

క్యాతనపల్లిలో ఉదయం నుంచి టెన్షన్‌‌ వాతావరణం నెలకొంది. మున్సిపల్​ చైర్‌‌‌‌పర్సన్‌‌ జంగం కళ,  వైస్‌‌చైర్మన్​ సాగర్​రెడ్డిపై అవిశ్వాసానికి తెరలేపారు. అవిశ్వాసానికి మద్దతుగా 17 మంది బీఆర్‌‌‌‌ఎస్​ కౌన్సిలర్లు మొదట కలెక్టర్‌‌‌‌కు నోటీసులు ఇచ్చారు.  అనంతరం ​కాంగ్రెస్​ పార్టీ  చైర్‌‌‌‌పర్సన్​, వైస్​ చైర్మన్‌‌కు మద్దతుగా క్యాంపు ఏర్పాటు చేసింది.  చైర్​పర్సన్​, వైస్​ చైర్మన్​తో పాటు కలెక్టర్‌‌‌‌కు నోటీసులిచ్చిన వారిలో నలుగురు బీఆర్‌‌‌‌ఎస్​ కౌన్సిలర్లు, మరో ఇద్దరు కాంగ్రెస్​ కౌన్సిలర్లు మొత్తం తొమ్మిది మంది క్యాంపులో  చేరారు.

ALSO READ : వీ6 న్యూస్ యూట్యూబ్ చానెల్ సబ్ స్ర్కైబర్లు కోటి మంది.. అందరికీ శతకోటి వందనాలు

వీరంతా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు.  అవిశ్వాసం వీగిపోవడంతో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి నేతృత్వంలో కాంగ్రెస్​ పార్టీ మున్సిపల్​ పాలకవర్గంపై పట్టు నిలుపుకుంది.