
సుశాంత్ సింగ్ రాజ్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె శరీరంలోని ప్రైవేట్ భాగాలపై గాయాలున్నట్లు తెలుస్తోంది. కానీ ఆమెకు పోస్ట్ మార్టం చేసిన వైద్యులు ఆ గాయాలపై స్పందించలేదు.
ఇండియా టుడే కథనం ప్రకారం..దిశా సాలియన్ ముంబైలోని ఒక భవనానికి చెందిన 14వ అంతస్తులో నివాసం ఉంటున్నారు. అయితే జూన్ 9న 14వ అంతస్తు నుంచి దూకినట్లు గుర్తించారు. కానీ ఆమె అదే సమయంలో తన కాబోయే భర్త రోహన్ రాయ్ ఇంట్లో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అందుకు కారణం లేకపోలేదు. జూన్ 9న తెల్లవారు జామున 2గంటల ప్రాంతంలో దిశ మరణించారు. మరణించినట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు ఆమె డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించాలి. కానీ అలా జరగలేదు. రెండు రోజుల తరువాత అంటే జూన్ 11న బోరివాలి పోస్ట్ మార్టం కేంద్రంలో పోస్ట్ మార్టం నిర్వహించారు. మరి డెడ్ బాడీకి రెండు రోజుల తరువాత పోస్ట్ మార్టం ఎందుకు నిర్వహించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీనికి తోడు దిశా డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్లు ఆమె తలతో పాటు శరీరంలో అసహజమైన గాయాలున్నట్లు తెలిపారు. 14వ అంతస్తునుంచి పడిపోవడం వల్ల ఆ గాయాలైనట్లు చెబుతున్నారు. కానీ పై నుంచి కిందపడిపోతే బాడీ మొత్తం గాయాలవుతాయి. కానీ దిశా డెడ్ బాడీలో అక్కడక్కడ అసజమైన గాయాలు ఎందుకు అవుతాయని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు మహరాష్ట్ర మాజీ సీఎం నారాయణ రాణే దిశాది ఆత్మహత్యకాదని, హత్య చేశారని చెప్పారు. ఆమె శరీరంలోని ప్రైవేట్ భాగాలపై గాయాలున్నట్లు ఆరోపించారు. పోస్ట్ మార్టం నివేదికలో దిశా ప్రైవేట్ భాగాలపై గాయాలున్నట్లు తెలుస్తోంది. కానీ ఆ గాయాల గురించి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు స్పందించలేదు. 14వ అంతస్తునుంచి కిందపడిపోవడం వల్ల శరీరంలో ఆమెకు అసహజమైన గాయాలైనట్లు పోస్ట్ మార్టం నివేదికలో పేర్కొన్నారు.
మరోవైపు మహిళల అసహజ మరణాల కేసులో ప్రత్యేకంగా కెమికల్ టెస్ట్ లు చేస్తారు. ప్రస్తుతం దిశా డెడ్ బాడీకి కెమికల్ టెస్ట్ లు చేస్తున్నట్లు వైద్యులు పోస్ట్ మార్టం నివేదికను తయారు చేశారు.