మహిళా డాక్టర్ పై జిల్లా వైద్యాధికారి లైంగిక వేధింపులు

మహిళా డాక్టర్ పై జిల్లా వైద్యాధికారి లైంగిక వేధింపులు

జయశంకర్ భూపాలపల్లి: మహిళా డాక్టర్‌ పట్ల జిల్లా వైద్యాధికారి లైంగిక వేధింపులకు పాల్పడడంతో బాధితురాలు పీఎస్ లో ఫిర్యాదు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన‌ డి.ఎం.హెచ్.ఓ వేణుగోపాలరావు.. చెల్పూర్ ఆస్పత్రి వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న పద్మ రాణిని కొంతకాలంగా గోపాల్‌రావు లైంగికంగా వేధిస్తున్నాడు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై గత 15 రోజులుగా విచారణ జరిపిన పోలీసులు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి వైద్యాధికారి గోపాల్‌రావుకు అరెస్టు వారెంట్ జారీ చేశారు. అత‌న్ని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.

ఇదిలా ఉండగా,జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శశిధర్ రెడ్డి వేధింపులకు గురి చేస్తున్నాడంటూ కాటారం ఎక్సైజ్ సీఐ ప్రశాంతి జాయింట్ కలెక్టర్,కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్న కానిస్టే బుల్స్ విధులకు రాకున్నా వచ్చినట్లుగా హాజరు వేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆరోపించారు .ఎప్పుడూ పరుషపదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు. ఆమె పిర్యాదుపై కూడా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.