పర్మిషన్​ లేని హాస్పిటల్స్​పై చర్యలు తప్పవు : రవికుమార్

పర్మిషన్​ లేని హాస్పిటల్స్​పై చర్యలు తప్పవు : రవికుమార్

అచ్చంపేట, వెలుగు: ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేట్​ హాస్పిటల్స్​ నడిపితే కఠిన చర్యలు తప్పవని డీఐవో​డాక్టర్  రవికుమార్​ హెచ్చరించారు.  అచ్చంపేట పట్ఠణంలో రెండేండ్లుగా ఎలాంటి పర్మిషన్​ లేకుండా నిర్వహిస్తున్న చరిత సాయి హాస్పిటల్ పై జిల్లా అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు.. 2021 నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా హాస్పిటల్​ నిర్వహిస్తున్నట్లు గుర్తించి సీజ్​ చేశారు.

ఈ సందర్భంగా డీఐవో మాట్లాడుతూ 2021 వరకు చిన్న పిల్లల వైద్యుడు డాక్టర్  అప్పారావు పేరుపై హాస్పిటల్​కు పర్మిషన్​ తీసుకొని ఆర్ఎంపీలతో వైద్యం కొనసాగించినట్లు తెలిపారు. ఆ తర్వాత రెన్యువల్  చేసుకోలేదని చెప్పారు. అంతకుముందు అచ్చంపేట గవర్నమెంట్​ హాస్పిటల్​లోని చిన్న పిల్లల విభాగాన్ని పరిశీలించారు. ఆయన వెంట హెల్త్​ ఎడ్యుకేటర్​ శ్రీనివాసులు, మాణిక్యమ్మ, పాషా ఉన్నారు.