విడాకుల ఫొటో షూట్.. కొత్త ట్రెండ్ మొదలెట్టాశారు

విడాకుల ఫొటో షూట్.. కొత్త ట్రెండ్ మొదలెట్టాశారు

పెళ్లికి ఫొటో షూట్ అనేది కామన్.. ఇటీవల చిన్నా చితక ఫంక్షన్స్ కు కూడా ఫొటో షూట్స్ చేస్తున్నారు. లేటెస్ట్ గా కొత్త ట్రెండ్ మొదలైంది. అదే డైవర్స్.. విడాకుల ఫొటో షూట్. ఇంకా ఇండియాలో మొదలు కాలేదు కానీ.. విదేశాల్లో జోరుగా సాగుతుంది. డైవర్స్ ఫొటో షూట్స్ హవా నడుస్తుంది. లేటెస్ట్ గా జరిగిన ఈ డైవర్స్ ఫొటో షూట్ ఈవెంట్ చూస్తే.. ఎలా చేస్తారు.. ఏం చేస్తారు.. ఏ విధంగా ఉంటుంది అనేది స్పష్టం అవుతుంది. 

అమెరికాకు చెందిన లారెన్ బ్రూక్ అనే మహిళ విడాకులు తీసుకున్న సందర్భంగా.. హ్యాపీగా ఫొటో షూట్ చేసుకుంది. పెళ్లి నాటి దుస్తుల్లో వచ్చిన లారెన్ బ్రూక్.. వాటిని తీసేసి తగలబెడుతుంది. ఆ తర్వాత పెళ్లి నాటి ఫొటోలను చింపేస్తుంది.. ఆల్బమ్ తగలబెడుతుంది. ప్రేమ్​ ఫొటోలను కాళ్ల కింద పడేసి పగలగొడుతుంది. పెళ్లి నాటి జ్ణాపకాలు అన్నింటినీ నాశనం చేస్తుంది. ఆ తర్వాత హ్యాపీగా షాంపెయిన్ ఓపెన్ చేసి ఎంజాయ్ చేస్తుంది లారెన్ బ్రూక్. చివరగా డ్రైవర్స్ డ్ అనే థ్రెడ్ రచూపిస్తూ.. నవ్వులు చిందిస్తుంది. పెళ్లి నాటి కంటే.. డైవర్స్ ఫొటో షూట్ లో ఒంటరిగా బాగా ఎంజాయ్ చేశానని.. ఫొటోలు బాగా వచ్చాయంటూ తన ఇన్ స్ట్రాలో ఫొటోలను పోస్ట్ చేసింది లారెన్ బ్రూక్. 

ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిన ఈ ఫొటోలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొత్త ట్రెండ్ ఎవరి కోసం.. ఏ వ్యాపారం కోసం అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. విడాకుల విషయంలో తప్పు ఎవరిది అనేది చెప్పి ఉంటే బాగుండేది అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. నువ్వు బాధపడ్డావని చెప్పటానికి.. ఇంత పెద్ద ఫొటో షూట్ పెట్టాలా అంటూ మరికొంత మంది నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. ఇలాంటి పిచ్చి పనులు చేసే వాళ్లను ఆస్పత్రిలో పెట్టాలని.. ఇలా ఫొటో షూట్స్ పెట్టకూడదని మరికొందరు నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. 

ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా.. డైవర్స్ ఫొటో షూట్ ఎలా చేయాలి.. ఎలా ఉంటుంది అని అందరికీ చెప్పిందని.. మిగతా వాళ్లు కూడా దీన్ని ఫాలో అవుతారని.. రాబోయే రోజుల్లో ఇలాంటి చిత్ర, విచిత్రాలు మరిన్ని చూడాల్సి రావటం ఖాయం అంటున్నారు నెటిజన్లు.. చూడాలి రాబోయే రోజుల్లో డైవర్స్ ఫొటో షూట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో..