Good Health : మీ పిల్లలు యాక్టివ్గా ఉండాలంటే ఇలా చేయండి

Good Health : మీ పిల్లలు యాక్టివ్గా ఉండాలంటే ఇలా చేయండి

పిల్లల బిహేవియర్ కొన్నిసార్లు కొత్తగా అనిపిస్తుంది. కొందరు పిల్లలు మాటిమాటికి చిరాకు పడుతుంటారు. మరికొందరు మూడీగా ఉంటారు. వాళ్లు అలా ప్రవర్తించడానికి కొన్ని కారణాలేంటంటే...

• పిల్లలు హుషారుగా ఉండాలంటే కంటి నిండా నిద్ర ఉండాలి. నిద్రలేకపోతే వాళ్లు మూడీగా, డల్
కనిపిస్తారు.
• వాళ్లకి హెల్దీ ఫుడ్, అది కూడా టైమ్ కు తినిపించాలి. పోషకాలు లేని ఫుడ్ తింటే పిల్లలు యాక్టివ్ గా ఉండరు. దాని ఎఫెక్ట్ వాళ్ల మూడ్ ని మార్చేస్తుంది. 

• రోజూ ఫలానా టైమ్ కు, ఫలానా పని చేయడం పిల్లలకి అలవాటు చేయాలి. దాంతో వాళ్ల మైండ్ ఒక ఫార్మాటికి అలవాటు పడుతుంది.

• పిల్లలు ఆటలు, చదువులో పడి నీళ్లు తక్కువ తాగుతారు. ఒంట్లో నీరు తగ్గడంతో డీ హైడ్రేషన్ కు గురవుతారు. అలా జరగకూడదంటే వాళ్లు ఇంటికి రాగానే నీళ్లు తాగించాలి.

• ఆరుబయట ఆటలు ఆడకపోవడం వల్ల కూడా పిల్లలు డల్ గా కనిపిస్తారు. స్మార్ట్ ఫోన్లు చూడడం, ఫోన్ లో ఎక్కువ సేపు గేమ్స్ ఆడడం వంటివి కూడా పిల్లల బిహేవియర్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి.