
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చారు. తన ఫేస్ బుక్, యూ ట్యూబ్ అకౌంట్లను ట్రంప్ మళ్లీ ప్రారంభించారు. ఐయామ్ బ్యాక్ అంటూ ఫేస్ బుక్ లో ఫస్ట్ పోస్ట్ పెట్టారు. 2016లో అధ్యక్ష ఎన్నికల్లో విజయం తర్వాత ట్రంప్ చేసిన ప్రసంగంలో 12 సెక్లన్ల వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఇన్నాళ్లు అభిమానులను వెయిటింగ్ పెట్టినందుకు ట్రంప్ క్షమాపణలు చెప్పారు.
2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ ఘటన తర్వాత ట్రంప్ ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఆంక్షలు విధించారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నారని నిషేధించారు. అయితే రెండు నెలల క్రితం ట్రంప్ ఫేస్‌బుక్ అకౌంట్‌ను మేటా అన్‌లాక్ చేసింది. తాజాగా జు యూట్యూబ్ కూడా ట్రంప్ అకౌంట్‌ను రీస్టార్ట్ చేసింది. డోనాల్డ్ ట్రంప్ ఛానల్లో కంటెంట్‌ను పోస్టు చేసుకోవచ్చని ప్రకటించింది.
76 ఏళ్ల ట్రంప్ అమెరికా అధ్యక్ష బరిలో రెండోసారి పోటీచేయబోతున్నారు. ట్రంప్ కు ఫేస్‌బుక్లో 34 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా..యూట్యూబ్ లో 2.6 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.