
న్యూఢిల్లీ: రిపబ్లికన్ పార్టీ తరఫున ఈ ఏడాది ప్రెసిడెన్షియల్ నామినేషన్‌ను ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లేలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాక్సెప్ట్ చేయనున్నారు. ఈ మూమెంట్‌ను జాక్సన్‌విల్లే లాంటి గ్రేట్ సిటీలో జరుపుకోవడం సంతోషంగా ఉందని రిపబ్లికన్ నేషనల్ కమిటీ చైర్ విమెన్ రొన్నా మెక్ డానియల్ తెలిపారు. హోం స్టేట్‌గా ట్రంప్ హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న ఫ్లోరిడా.. 2020 ఎలక్షన్స్‌లో విక్టరీ సాధించడంలో చాలా కీలకం కానుందన్నారు. ఆగస్టు 27న జాక్సన్‌విల్లేలో నామినేషన్‌ను స్వీకరించే సమయంలో ట్రంప్ మాట్లాడనున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. వేర్పాటుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన నల్ల జాతి ఉద్యమకారులను దారుణంగా కొట్టిన ఘటనకు 60వ యానివర్సరీ అదే రోజు కావడం గమనార్హం. సుమారు 200 మంది తెల్ల జాతీయులు గొడ్డళ్లు, బేస్ బాల్ హ్యాండిల్స్‌తో బ్లాక్ యాక్టివిస్టులపై క్రూరంగా దాడి చేశారు. అందుకే ఆ రోజును ‘యాక్స్ హ్యాండిల్ శాటర్‌డే’గా పిలుస్తారని ఫ్లోరిడా హిస్టోరియల్ సొసైటీ తెలిపింది.