ఈ తేదీలు మరవొద్దు..  డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత ఫైన్ తప్పదు   

ఈ తేదీలు మరవొద్దు..  డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత ఫైన్ తప్పదు   

 

న్యూఢిల్లీ: పాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఆధార్ లింక్ నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ వరకు  వివిధ కీలక ఫైనాన్షియల్ ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ నెలలోనే  డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్ ఉన్నాయి. ఇందులో ఇప్పటికే డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొడిగించిన ఈవెంట్స్ కూడా ఉన్నాయి.  ఉద్యోగులు,   ట్యాక్స్ పేయర్లు ఈ డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను  గుర్తు పెట్టుకోవడం ముఖ్యం. 

పాన్ – ఆధార్ లింకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

 పాన్–ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లింక్ చేయడానికి ఈ నెల 30 చివరి తేది. ఈ ఏడాది మార్చి 31 గా ఉన్న డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ నెల 30 వరకు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పొడిగించింది. ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లింక్ చేయకపోతే పాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డ్ పనిచేయకుండా పోతుంది.  డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ తర్వాత కూడా  పాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లింక్ చేసుకోవచ్చు. కానీ, రూ.1,000 ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాన్ లింక్ చేయకపోతే సంబంధిత వ్యక్తి ట్యాక్స్ రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఐటీ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాసెస్ చేయదు.

ఎక్కువ పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం..

ఎంప్లాయర్లు (ఉద్యోగం ఇచ్చిన వారు) ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఈపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కింద ఎక్కువ అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  కంట్రీబ్యూట్ చేయాలంటే ఈ నెల 26 లోపు జాయింట్ ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని ఎంప్లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఉద్యోగి తీసుకుంటారు. ప్రస్తుతం ఎక్కువ శాలరీ వచ్చినప్పటికీ ఈపీఎస్ కింద చేసే కంట్రీబ్యూషన్ నెలకు రూ.15 వేల కంటే ఎక్కువ  ఉండకూడదు. ఉదాహరణకు ఒక ఉద్యోగికి రూ.50 వేల శాలరీ వస్తే, బేసిక్ శాలరీలో 12 శాతాన్ని ఎంప్లాయర్ ఉద్యోగి ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్ చేస్తారు. అంటే రూ.6,000. ఇందులో రూ.1,250 ( రూ. 15 వేలలో 8.33 శాతం) ఈపీఎస్ కింద జమ అవుతుంది. మిగిలిన అమౌంట్ రూ.6,000– 1,250 = రూ.4,750 ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద జమ అవుతుంది. జాయింట్ ఆప్షన్ ఎంచుకుంటే  ఉద్యోగి అసలు శాలరీలో 8.33 శాతం ఈపీఎస్ అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తారు. అంటే ఎంప్లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే కంట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (రూ.6,000) లో రూ.4,750 (రూ.50 వేలలో 8.33 శాతం) ఈపీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద జమ అవుతుంది. మిగిలిన రూ.1,835 ఈపీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద జమ అవుతుంది.

బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

 బ్యాంకులు కొత్త లాకర్ అగ్రిమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దశల వారీగా రెన్యూవల్ చేయాల్సి ఉంది.  ఈ ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 31 లోపు లాకర్ సదుపాయాలు తీసుకున్న కస్టమర్లతో కొత్త అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కుదుర్చుకోవాల్సి ఉంటుంది.  ఇందులో 50 శాతం అగ్రిమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈ నెల 30 లోపు, 75 శాతాన్ని సెప్టెంబర్ 30 లోపు రెన్యువల్ చేయాలి. బ్యాంకులు స్టాంప్ పేపర్లపై లాకర్ అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తయారు చేయాల్సి ఉంటుంది. స్టాంప్ పేపర్లను కూడా కస్టమర్లకు ఫ్రీగా  అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది.

ఫ్రీ ఆధార్ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. 

ప్రజలు తమ ఆధార్ కార్డ్ డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫ్రీగా అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ (యూఐడీఏఐ) అందుబాటులోకి తెచ్చింది. దీనికి ఈ నెల 14 చివరి తేది. మై ఆధార్ పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రమే ఈ సర్వీస్ ఫ్రీ. అదే ఫిజికల్ ఆధార్ సెంటర్ల దగ్గర అయితే రూ.50 ఫీజు వసూలు చేస్తారు. అడ్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటివి సంబంధిత డాక్యుమెంట్లను  ఆధార్ పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సబ్మిట్ చేయడం ద్వారా సవరించుకోవచ్చు. 

అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్ పేమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

ఒక ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.10 వేల కంటే ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సిన  సొంత బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేసుకుంటున్న ప్రొఫెషనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జీతాలపై ఆధారపడే ఉద్యోగులు, బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు  అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కట్టాల్సి ఉంటుంది. ఉద్యోగులకు అయితే ఎంప్లాయర్లే అడ్వాన్స్ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కట్ చేస్తారు. మిగిలిన ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నాలుగు విడతల్లో కట్టాలి. ఇందులో మొదటి 15 శాతం ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈ నెల 15 లోపు కట్టాలి.