ప్రసార భారతిలో జర్నలిస్ట్ పోస్టులు.. జీతం 45వేలు.. డిగ్రీ పాసైతే చాలు..

ప్రసార భారతిలో జర్నలిస్ట్ పోస్టులు.. జీతం 45వేలు.. డిగ్రీ పాసైతే చాలు..

దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ (prasara bharathi) బ్రాడ్‌‌కాస్ట్ అసిస్టెంట్, కాపీ ఎడిటర్లు, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు  ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్‌‌ను సమర్పించడానికి చివరి తేదీ  డిసెంబర్ 15.

పోస్టులు: తెలుగు న్యూస్ రీడర్స్, ఉర్దూ న్యూస్ రీడర్స్, వీడియో ఎడిటర్ (తెలుగు & ఉర్దూ), అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ (తెలుగు & ఉర్దూ), కాపీ ఎడిటర్ (తెలుగు & ఉర్దూ), అసిస్టెంట్ వెబ్​సైట్ ఎడిటర్ తెలుగు & ఉర్దూ, బ్రాడ్​కాస్ట్ అసిస్టెంట్.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పోస్టులను అనుసరించి వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. పూర్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.

వయోపరిమితి:  21 ఏండ్ల నుంచి 50 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.  

అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 21.

లాస్ట్ డేట్: డిసెంబర్ 15.

సెలెక్షన్ ప్రాసెస్: పోస్టులను అనుసరించి వేర్వేరు ఎంపిక పద్ధతులు ఉంటాయి. షార్ట్​లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పరీక్ష, ఆడిషన్, స్క్రీన్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

శాలరీ: తెలుగు న్యూస్ రీడర్స్, ఉర్దూ న్యూస్ రీడర్స్​కు రోజుకు రూ.1875, బ్రాడ్​కాస్ట్ అసిస్టెంట్, కాపీ ఎడిటర్ (తెలుగు & ఉర్దూ), వీడియో ఎడిటర్ (తెలుగు & ఉర్దూ) రోజుకు రూ.1500, అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ (తెలుగు & ఉర్దూ) రోజుకు 2400,  అసిస్టెంట్ వెబ్​సైట్ ఎడిటర్ తెలుగు & ఉర్దూ రోజుకు రూ.2100 చొప్పున చెల్లిస్తారు.

పూర్తి వివరాలకు  prasarbharati.gov.in వెబ్​సైట్​ను సందర్శించండి.